కుల్వకుంటలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని కల్వకుంట గ్రామ శివారులోని పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను నిజాంపేట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం కల్వకుంట గ్రామ శివారులో మల్లేశం వ్యవసాయ భూమి వద్ద గుడిసెల్లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకొని పేకాడుతున్న నాయిని శంకర్, కాశమైన రాజేష్, దాకాని రమేష్, కుంచన రాజు, అక్కిరిగారి యాదగిరి, షేర్ పల్లి యాదగిరిలను అదుపులోకి తీసుకున్నారు. రెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15,410 నగదు, ఆరు సెల్‌ఫోన్‌లు, రెండు బైక్‌లు స్వాఽ దీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమో దు చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్ స్టేడియంలో విమానం ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన చిత్రం రెడ్జిట్‌లో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈచిత్రాన్ని పోస్ట్ చేయడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మరికొంత మంది నెటిజన్‌లు తెలిపిన ప్రకారం.. విమానం ఆకాశం మధ్యలో ప్రయాణిస్తున్న సమయంలో ఉపగ్రహం తీసిన చిత్రంగా భావిస్తున్నారు. ఉపగ్రాహాలు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో వేర్వేరు క్షణాల్లో క్యాప్చర్ చేయడంతో క్రోమాటిక్ అబరేషన్ అనే విజువల్ ఎఫెక్ట్ ఏర్పడి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ కారణంగా స్టేడియంలో విమానం పార్కింగ్ చేసినట్లు కనిపించినా.. అది కేవలం గూగుల్ మ్యాప్‌లో కనిపించే సాధారణ ఉపగ్రహ చిత్ర ప్రభావమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నట్లు పలువురు తెలిపారు.
మందుబాబులకు
జరిమాన
గజ్వేల్‌రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కోర్టు జరిమాన విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని బుధవారం గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి ఎదుట హాజరు పర్చగా విచారణ అనంతరం ఆరుగురికి రూ. 51,500 జరిమానా విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఐదుగురికి రూ. 5వేల చొప్పున జరిమానా విధించారు.


