తీగుల్‌లో పులి సంచారం | - | Sakshi
Sakshi News home page

తీగుల్‌లో పులి సంచారం

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

తీగుల

తీగుల్‌లో పులి సంచారం

గజ్వేల్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ నియోజకవర్గంలోని సిరిసినగండ్ల, మాత్‌పల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలోనూ పాదముద్రలను గుర్తించారు. తెల్లవారు జామున రైతు మహిపాల్‌ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అంతకంటే ముందు రోజు రెండు ఎద్దులను అక్కడే కట్టేసి మేత వేసి వచ్చాడు. తెల్లారి వెళ్లి చూసే సరికి ఒక ఎద్దు తెంపుకోవడంతో, ముక్కుతాడు ఊడిపోయి బెదురుతూ కనిపించింది. ఇదే క్రమంలో తాను ఇటీవల విత్తిన మొక్క

జొన్న చేనులో, నారుమడిలో పులి పాదముద్రలను గమనించాడు. వెంటనే గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు విషయం చెప్పాడు. దీంతో డీఎఫ్‌ఓ పద్మజారాణి గజ్వేల్‌ ఎఫ్‌ఆర్‌ఓ వినాయక్‌తోపాటు ఇతర సిబ్బందితో ఇక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా పులి పాద ముద్రలున్న చోట సున్నం ముగ్గుతో డబ్బా వేయించి పరిశీలిస్తున్నామని విలేకరులతో చెప్పారు. ఈ పాద ముద్ర లు పులివా? లేదా హైనా లాంటి ఇతర అడవి జంతువులవా? అని నిర్ధారిస్తామన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వచ్చే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమయంలో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని, తప్పనిసరిగా గుంపులుగా వెళా ్లలని సూచించారు. గ్రామంలో ఈ విషయాన్ని దండోరా వేయించాలన్నారు. పులిని గుర్తించడానికి అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు పులి సంచారం వార్తల నేపథ్యంలో పొలాల గట్లపై విద్యుత్‌ షాక్‌ తగిలేలా వైరింగ్‌ ఏర్పాటు చేయవద్దని సూచించారు. దీనివల్ల సాధారణ అడవి జంతువులు చనిపోయే ప్రమాదముందన్నారు. కాగా పాద ముద్రలు తీగుల్‌లోనే కాకుండా, కుకునూర్‌పల్లి మండలం అంతాయిగూడలోని రైతు కిష్టయ్య పొలం వద్ద కూడా గుర్తించారు.

మునుపెన్నడూ లేని గజ్వేల్‌ నియోజవర్గంలో పులి సంచరించడంతో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. పులి సంచారం ముందుగా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లి శివారు నుంచి ఇటీవల ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పులి ఈనెల 10న కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో సంచరించి రైతు మల్లయ్యకు చెందిన రెండు పశువులను చంపేసిందని భావిస్తున్నారు. దీని తర్వాత తీగుల్‌ వైపు వచ్చి...ఆ తర్వాత అంతాయిగూడ వెపు వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులి ఆనవాళ్ల నేపథ్యంలో రైతుల్లో, ఆయా గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు వేగంగా విచారణ పూర్తి చేసి ఏం జరిగిందనే అంశంపై వాస్తవాలను వెల్లడించాలని, పులిని పట్టుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. దూర ప్రాంతాల్లో వదిలేలా ఏర్పాట్లు చేస్తేనే రైతుల్లో భయాందోళన తొలగిపోనుంది.

పెద్ద మాసాన్‌పల్లి నుంచి సంచారం?

తాజాగా పాదముద్రల గుర్తింపు

వరుస ఘటనలతో కలకలం

గజ్వేల్‌ నియోజకవర్గంలో

భయాందోళనలో ప్రజలు

ఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ

తీగుల్‌లో పులి సంచారం1
1/1

తీగుల్‌లో పులి సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement