శ్రీవల్లికి పీహెచ్‌డీ | - | Sakshi
Sakshi News home page

శ్రీవల్లికి పీహెచ్‌డీ

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

శ్రీవ

శ్రీవల్లికి పీహెచ్‌డీ

పటాన్‌చెరు: ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధి గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఆదుర్తి శ్రీవల్లి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘మైక్రో ఫ్లూయిడ్‌ అప్లికేషన్ల కోసం మైక్రోఛానల్‌లో విద్యుత్‌ అయస్కాంత ప్రవాహం గణిత నమూనా, విశ్లేషణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రెజా ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ శ్రీవల్లి సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడంపై గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.రావు, గీతం రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

తొగుట యువకుడికి

సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం

తొగుట(దుబ్బాక): మండల కేంద్రానికి చెందిన యువకుడు కేంద్ర రక్షణశాఖలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ముచ్చర్ల రాజు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్ష రాసి సీఐఎస్‌ఎఫ్‌ శాఖలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పేద కుటుంబానికి చెందినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉద్యోగం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లో చదువుకొని 922 మార్కులు సాధించాడు. ప్రస్తుతం రాజు ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండా స్వయంగా ప్రిపేరై కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలో ఉద్యోగానికి ఎంపికవ్వడంపై సర్పంచ్‌ శోభ అభినందించారు.

రాష్ట్ర స్థాయి

ఖోఖో పోటీలకు ఎంపిక

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు అహ్మదీపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుగుణాకర్‌ పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన జీ.వైష్ణవి, ఏ.అఖిల్‌ ఈనెల 9న ఉమ్మడి మెదక్‌ జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన సబ్‌ జూనియర్‌ ఖోఖో క్రీడాకారుల ఎంపికలో పాల్గొని ప్రతిభ చాటారు. వీరు ఈనెల 18 నుంచి 20వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నారాయణ్‌పేటలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను, పీడీ నాగేశ్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని హద్నూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ దోమ సుజిత్‌ కథనం ప్రకారం...మండల పరిధిలోని చాల్కి చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం ఎస్‌ఐ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో తరలిస్తున్న 5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నారాయణఖేడ్‌ మండల పరిధిలోని పిప్రి గ్రామానికి చెందిన జాదవ్‌ పరశరాంను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌

లేనివారికి జరిమాన

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి , డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన విధించింది. పట్టణ ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో 18మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,57,000 జరిమాన విధించినట్లు సీఐ తెలిపారు.

శ్రీవల్లికి పీహెచ్‌డీ  1
1/1

శ్రీవల్లికి పీహెచ్‌డీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement