కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం
గజ్వేల్‌రూరల్: కార్మికులు, రైతులకు అన్యాయం చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ము కాస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన కార్మిక, కర్షక పోరుబాట జీపుజాతను శుక్రవారం గజ్వేల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పోరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్‌కోడ్‌లను తెచ్చిందన్నారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ నెల19న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ, అలాగే ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లయ్య, గోపాలస్వామి, నాయకులు శశిధర్, వెంకట్, బండ్ల స్వామి, భాస్కర్, రవి, బాలలక్ష్మి, వేణుగోపాల్, రంగారెడ్డి, కుమార్, యాదయ్య, రాజు, అభి పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు


