సిద్దిపేట జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
సిద్దిపేటజోన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 45 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వారిలో 16 మందితో కూడిన సీనియర్ జట్టును ఎంపిక చేశారు. వీరు తెలంగాణ టీ20 టోర్నీలో జిల్లా తరఫున అడనున్నారు. కెప్టెన్‌గా సిద్దిపేటకు చెందిన సుమంత్, వైస్ కెప్టెన్‌గా అసద్‌ను ఎంపిక చేశారు. ఎంపిక లెక్షన్ ప్రక్రియను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మల్లికార్జున్ పర్యవేక్షించారు.
సిద్దిపేట యువకుడికి అవకాశం
డిసెంబర్ 24 నుంచి రాజ్‌కోట్‌లో జరగనున్న బీసీసీఐ సీనియర్స్ పురుషుల విజయ్ హజారే ట్రోఫీ టోర్నీకి సిద్దిపేట క్రీడాకారుడు అర్ఫాజ్ ఎంపిక అయ్యాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తమ ప్రతిభ చూపాడు. ఈ సందర్భంగా సిద్దిపేటలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్ఫాజ్‌ను ఘనంగా సన్మానించారు.


