అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
సిద్దిపేటకమాన్: అప్పుల బాధ తాళలేక వ్యాపారస్తుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేటలో నివాసం ఉంటున్న కల్వకుంట్ల శ్రీనివాస్ (54) స్థానికంగా భరత్‌నగర్‌లో 20ఏళ్లుగా బుక్ డిపో నిర్వహిస్తున్నారు. వ్యాపార నిమిత్తం, తన భార్య అనారోగ్య కారణాల వల్ల సుమారు రూ.కోటి వరకు అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ గురువారం ఉదయం బుక్‌డిపోలోని గోదాంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవత తెలిపారు.


