బీఆర్‌ఎస్‌కు అధికారం ఖాయం
సదాశివపేట(సంగారెడ్డి): ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. సదాశివపేటలోని తన స్వగృహంలో నియోజకవర్గ పరిధిలోని సదాశివపేట, సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాలకు చెందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులను శనివారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించాలని కొత్త సర్పంచులకు సూచించారు. కేసీఆర్ పాలన కావాలని ప్రజలందరు కోరుకుంటున్నారని, త్వరలో అది నెరవేరబోతుందన్నారు.
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
నూతన సర్పంచ్ వార్డు సభ్యులకు
సన్మానం


