అరుణోదయం.. ప్రకృతి సోయగం
ఓ వైపు మంచు తెరలు తొలుగుతున్నాయి. మరోవైపు ఆకాశం నుంచి భూమి వైపు సూర్యుడు తొంగి చూస్తున్నాడు. బంగారువర్ణంలో సూర్య కిరణాలు పొగమంచును చీల్చుకుంటూ భూమిని తాకుతున్నాయి. పక్షులు కిలకిలరావాలు చేస్తుండగా.. చెరువులో జల సవ్వడులు.. సూర్యోదయం వేళ ఆకాశం అరుణ వర్ణంలో మెరుస్తూ, ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా కనువిందు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువులో ఆదివారం ఉదయం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


