కోడ్ ఉల్లంఘిస్తే కొరడా
● అవసరమైతే క్రిమినల్ కేసులు
● నేరం రుజువైతే జైలు శిక్ష
జహీరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి, లేనట్లయితే బరి నుంచి తప్పుకునే పరిస్థితి ఎదురు కావొచ్చు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్)ను ఉల్లంఘిస్తే పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరం అయితే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయవచ్చు. నేరం రుజువు అయితే జైలుశిక్ష కూడా పడవచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధల మేరకు నడుచుకోవాలి.
స్వేచ్ఛగా జరిగేందుకే కోడ్
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్(ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది.
నిబంధనలు ఇవే..
● శాతిభద్రతల పరిరక్షణలో భాగంగా బీఎన్‌ఎస్–163 (144 సీఆర్‌పీసీ యాక్టు) అమలు చేస్తారు.
● నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండవద్దు.
● అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ప్రచారం నిర్వహించవద్దు. కర్రలు, ఇతర మారణాయుధాలతో తిరగవద్దు.
● పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. ఆ తర్వాత ప్రచారం చేస్తే కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తారు.
● అన్ని రకాల సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాల్లో) ప్రత్యర్థులను విమర్శిస్తూ పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారు.
● బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా, అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, ఓటర్లకు పంచుతూ పట్టుబడినా కేసు నమోదు చేస్తారు. అలాగే 34ఏ ఎకై ్సజ్ చట్టం1968 కింద జరిమాన, శిక్ష విధిస్తారు.


