లోకల్‌ మేనిఫెస్టో | - | Sakshi
Sakshi News home page

లోకల్‌ మేనిఫెస్టో

Dec 5 2025 1:18 PM | Updated on Dec 5 2025 1:18 PM

లోకల్‌ మేనిఫెస్టో

లోకల్‌ మేనిఫెస్టో

నారాయణఖేడ్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో పల్లెల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా మూడో విడత నామినేషన్ల పర్వం 5వ తేదీతో ముగియనుంది. పోటీలో నిలిచిన, ఇంకా విత్‌డ్రాలు కాకుండా పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. తాము గెలుపొందితే గ్రామానికి ఫలానా అభివృద్ధి చేస్తామంటూ సొంత మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యావంతులకు సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నారు. మరికొందరు పాఠశాల అభివృద్ధి, వీధుల్లో చేపట్టే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. కుల, యువజన సంఘాలు, మిత్రుల గ్రూపులకు ఫలానా పనులు చేస్తామంటూ చెబుతున్నారు. ఇలా ఆయా వర్గాల వారీ ఓట్లు గంపగుత్తగా వేసుకొనేందుకు తమ ప్రచారాన్ని పదును పెడుతున్నారు. ఓటర్ల నాడిని పసిగట్టి అందుకు అనుగుణంగా హామీలు గుప్పిస్తున్నారు.

తాయిలాలకూ సిద్దం..

ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో ఓటర్లకు తాయిలాలు మాట్లాడుతున్నారు. కులాలు, సంఘాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు సంసిద్ధతను చూపుతున్నారు. అభ్యర్థులు ఫలానా సంఘం, కులం ఓట్లు తమ ఖాతాల్లో పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లక్షల్లో అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సంఘాలకు వంట సామగ్రి, టెంటు, ఇతర వస్తువులు సైతం ఇస్తామంటూ పేర్కొంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. కొందరు భూములు, బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీసుకుంటున్నారు. గ్రామాల్లో మామూలు పంచాయతీలో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల దాకా, పెద్ద పంచాయతీల్లో 15లక్షల నుంచి ఆపైగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు.

స్థాయికి మించి అప్పులు..

పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందితే సంపాదించేది ఏమో కానీ స్థాయికి మించి అప్పులు చేస్తున్నారు. గత టర్మ్‌లో సర్పంచ్‌లుగా పనిచేసిన వారిలో చాలా మంది చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యారు. వారి పదవీకాలం పూర్తయి రెండేళ్లు గడచినా ఇంకా బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయ వనరులు ఉన్న కొన్ని పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్‌లు నాలుగు డబ్బులు సంపాదించొచ్చు కానీ మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు. గత టర్మ్‌ పరిస్థితులు చూసి కూడా ఇప్పుడు చాలా మంది ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు తహతహలాడుతూ స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు.

పల్లెల్లో జోరందుకున్న కుల సమీకరణలు

అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పోటా, పోటీ కార్యాచరణ

ఆయా సంఘాలకు తాయిలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement