బరిలో 3243 మంది
సంగారెడ్డి జోన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడతలో 3,243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా జిల్లాలో 136 సర్పంచ్, 1,246 వార్డు స్థానాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 149 సర్పంచ్, 215 వార్డు స్థానాల నుంచి అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నారు. 7 గ్రామ పంచాయతీలు, 113 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 129 సర్పంచ్, 1133 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. సర్పంచ్ కు 394, వార్డు స్థానాలకు 2,849 మంది అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు.
గుర్తుల కేటాయింపుతో ఊపందుకున్న ప్రచారం
అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. సర్పంచ్, వార్డు స్థానానికి వేరువేరుగా గుర్తులను కేటాయిస్తూ క్లస్టర్ల వారిగా జాబితాలను విడుదల చేశారు. గుర్తులు రావటంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ సమయం ఉండడంతో సమయం వృథా చేయకుండా ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామంలో రోజురోజుకీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఊపందుకున్న మొదటి విడత అభ్యర్థుల ప్రచారం
గుర్తులు కేటాయించిన అధికారులు
7 సర్పంచులు..113 వార్డు స్థానాలు ఏకగ్రీవం
వేడెక్కుతున్న పల్లె పోరు


