గ్రామాల రూపురేఖలు మారుస్తా
● మంత్రి దామోదర
● కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతల చేరిక
మునిపల్లి(అందోల్): ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మండలంలోని గార్లపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల రూపురేఖలు మారుస్తానని చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రహదారుల రూపురేఖలు మారుస్తామన్నారు. తక్కడపల్లి, గార్లపల్లి మధ్య సింగూరు బ్యాక్ వాటర్‌పై వంతెన ఏర్పాటుతో పాటు బుదేరా నుంచి రాయికోడ్ మండలం సీరూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాటిపల్లి నుంచి మక్తక్యాసారం గ్రామం వరకు డబుల్ రోడ్డు ఏర్పాటుకు ఇప్పటికే నిధులు మంజూరైనట్లు తెలిపారు.
కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న దామోదర


