మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్ధుంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహ్మద్ బిన్‌ఇద్రిస్(42) కొన్నాళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తూప్రాన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు భార్య శాహిన్‌బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
జిన్నారం (పటాన్‌చెరు): అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజిత్‌పాల్ (25) కొంతకాలంగా గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్టయ్యపల్లిలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తాను పనిచేసే పాంట్ వద్దకు వెళుతున్నాడు. ఈ క్రమంలో పంటపొలాల్లో నడుచుకుంటూ వెళ్లే క్రమంలో వరం మీది నుంచి కిందపడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విధులు నిర్వహిస్తూ కార్మికుడు..
జిన్నారం (పటాన్‌చెరు): విధులు నిర్వహిస్తూ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గడ్డపోతారం పారిశ్రమికవాడలో చోటు చేసుకుంది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆశి శ్రీనివాసరావు (49) కొన్నేళ్లుగా బొల్లారం పట్టణ పరిధిలోని వెంకట్ రెడ్డినగర్‌లో నివాసముంటున్నాడు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీఫార్మా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం విధులు నిర్వహిస్తుండగా కిందపడిపోయాడు. దీంతో వెంటనే సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పపరిశ్రమ నిర్వాహకులు మాత్రం ఎలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు. దీంతో కార్మికుడి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య


