రోజంతా కురిసిన చిరు జల్లులు
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● ఝరాసంగంలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదు ● ఇబ్బందులు పడిన జిల్లా వాసులు
మొంథా ముసురు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మొంథా తుఫాను ప్రభావంతో ముసురు పట్టింది. బుధవారం తెల్లవారు ఝాము నుంచి రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. చెప్పుకోదగిన వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ ఎడతెరిపి లేకుండా ముసురు పట్టడంతో జనం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ప్రధానంగా ఉదయం పూట పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. అలాగే ఆఫీసు వెళ్లేవారు, చిరు వ్యాపారులకు కూడా ముసురు కష్టాలు తప్పలేదు. రోడ్లపై వర్షం నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ముసురుతో కల్లాల్లో ఉన్న వర్షం తడిసి ముద్దయింది. కోతలు కోసి రోడ్లపై వడ్లు ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుని పోకుండా కాపాడుకునేందుకు అనేక తంటాలు పడ్డారు. తగినన్ని టార్పాలిన్లు లేకపోవడంతో బస్తాలు కప్పుకుని ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. జిల్లాలో చాలాచోట్ల రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోశారు. తేమశాతం తగ్గించుకునేందుకు రోడ్లపై పోసిన ధాన్యం ఇప్పుడు తడిసిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా కల్హేర్, హత్నూర, నారాయణఖేడ్, వట్‌పల్లి తదితర మండలాల్లో ధాన్యం రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాగే జోగిపేట్‌లోని మార్కెట్‌యార్డులో ధాన్యం తడిసిపోయింది. తూకాలు వేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో పత్తితీత జోరందుకుంది. ఈ క్రమంలో కురిసిన ముసురుతో రాయికోడ్, సదాశివపేట, సంగారెడ్డి, కొండాపూర్, మునిపల్లి, వట్‌పల్లి, నారాయణఖేడ్ తదితర మండలాల్లో పత్తి దెబ్బతింది. పత్తి కాయల్లో ఉన్న పత్తి తడిసిపోవడంతో అది రంగు మారి నల్లబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలల్లోకి వర్షం నీరు చేరడంతో మొక్కకు కింద భాగంలో ఉన్న పత్తి నీటిలో మునిగి నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం ఏమాత్రం ఎక్కువగా ఉన్నా సీసీఐ కొనుగో లు చేయడం లేదని, ఇప్పుడు పూర్తిగా తడిసిపోయి న పత్తిని ఎండబెట్టాలంటే ఎన్నిరోజులు పడుతుందోనని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
ఝరాసంగంలో 2.1 సెం.మీలు
తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురియకపోయినప్పటికీ తేలికపాటి వర్షంపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా ఝరాసంగం మండలంలో 2.10 సెం.మీ.ల వర్షపాతం రికార్డు అయింది. అలాగే మునిపల్లిలో 2 సెం.మీలు, కొండాపూర్, రామచంద్రాపురంలో 1.8 సెం.మీల చొప్పున, జిన్నారంలో 1.5 సెం.మీలు, కోహీర్‌లో 1.4 సెం.మీలు, అమీన్‌పూర్‌లో 1.3 సెం.మీలు, పటాన్‌చెరు 1.2 సెం.మీలు, పుల్కల్‌లో 1.1 సెం.మీలు, రుద్రారంలో 1 సెం.మీల వర్షం కురిసింది. భారీ వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ, ముసురుతో జిల్లా వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు.
రోజంతా కురిసిన చిరు జల్లులు
రోజంతా కురిసిన చిరు జల్లులు
రోజంతా కురిసిన చిరు జల్లులు


