దళారులతో మోసపోవద్దు
జోగిపేట ఏయంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి
వట్‌పల్లి(అందోల్): ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించే సమయంలో దళారులను ఆశ్ర యించి మోసపోవద్దని జోగిపేట ఏయంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రామకృష్ణ జిన్నింగ్ మిల్, సిద్ధార్థ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. పత్తి ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.8110, బీ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.8,060 ప్రభుత్వం మద్దతు ధరలు చెల్లిస్తుందన్నారు. తేమశాతం 12% లోపల ఉండేలా రైతులు చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, ఏయంసీ కార్యదర్శి సునీల్, సీపీఓ తిరుపతిరెడ్డి రైతులు పాల్గొన్నారు.


