పక్కాగా భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా భూసేకరణ

Oct 30 2025 10:09 AM | Updated on Oct 30 2025 10:09 AM

పక్కా

పక్కాగా భూసేకరణ

● విండ్‌ టవర్ల తొలగింపునకు చర్యలు ● నిమ్జ్‌ డిప్యూటీ కలెక్టర్‌ విశాలాక్షి ● జహీరాబాద్‌ నిమ్జ్‌ భూసేకరణ ఏయే గ్రామాల్లో చేపడుతున్నారు? ● భూ సేకరణ లక్ష్యం ఎంత? ఇప్పటి వరకు ఎంత సేకరించారు? ● ఫేజ్‌వన్‌లో ఎన్ని ఎకరాలు సేకరించారు? ● రెండవ ఫేజ్‌ పరిస్థితి ఏమిటీ? ● పరిశ్రమల స్థాపనలో జాప్యం ఎందుకు జరుగుతోంది?

పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు?

నిమ్జ్‌ కోసం సేకరించిన భూముల్లో ఉన్న విండ్‌ టవర్లను తొలగిస్తారా?

● విండ్‌ టవర్ల తొలగింపునకు చర్యలు ● నిమ్జ్‌ డిప్యూటీ కలెక్టర్‌ విశాలాక్షి

జహీరాబాద్‌ టౌన్‌: నిమ్జ్‌(జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి) భూ సేకరణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన ఆకస్మిక దాడులతో ఆ జోరు కాస్తా నెమ్మదించింది. భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ రాజు ఏసీబీకి దొరికిపోవడంతో రెండు నెలల నుంచి భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రైతులతో నిత్యం కిక్కిరిసిపోయే నిమ్జ్‌ కార్యాలయం కళ తప్పింది. రాజు స్థానంలో నిమ్జ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా విశాలక్షి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యాకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. భూసేకరణ పనులతో పాటు పరిహారం చెల్లింపులు చేపడుతున్నారు. నిమ్జ్‌ కార్యాలయం తిరిగి రైతులతో కళ కళలాడుతోంది. ఈ సందర్భంగా నిమ్జ్‌ భూసేకరణ తదితర అంశాలపై విశాలాక్షి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

డిప్యూటీ కలెక్టర్‌: ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లోని ఎల్గోయి, బర్దీపూర్‌, చిలేపల్లి, రుక్మాపూర్‌, ముంగి, హద్నూర్‌, మొలకన్‌పాడు, రేజింతల్‌, గంగ్వార్‌, న్యామతాబాద్‌, మెటల్‌కుంట, గణేశ్‌పూర్‌, హుసెల్లి, బసంత్‌పూర్‌, కల్బెమల్‌, మామిడ్గి, గుంజెట్టి 17 గ్రామాల్లో భూసేకరణ చేపడుతున్నాం.

డిప్యూటీ కలెక్టర్‌: భూసేకరణ లక్ష్యం 12,635 ఎకరాలు ఉంది. ఇందులో పట్టా, ప్రభుత్వ భూములున్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 వేల ఎకరాల వరకు భూసేకరణ జరిగింది.

డిప్యూటీ కలెక్టర్‌: ఫేజ్‌ వన్‌లో ఎల్గోయి, బర్దీపూర్‌, చిలేపల్లి గ్రామాల్లో 3,240 ఎకరాలు సేకరించాల్సి ఉండగా సుమారు 3 వేల ఎకరాల భూమిని సేకరించాం. మిగతా భూమికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసి సేకరించే పనిలో ఉన్నాం.

డిప్యూటీ కలెక్టర్‌: సెకండ్‌ ఫేజ్‌లో 9.747 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాం. హద్నూర్‌, మామిడ్గి తదితర గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ కాగా పరిహారం చెల్లింపులపై కసరత్తు చేస్తున్నాం.

డిప్యూటీ కలెక్టర్‌: నిమ్జ్‌లో భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఒప్పందాలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌, పరిశ్రమల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

డిప్యూటీ కలెక్టర్‌: భూసేకరణ పనులు పక్కాగా చేపడుతున్నాం. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు పరిహారం చెల్లిస్తున్నాం. కొంత జాప్యం జరిగిన పక్కాగా చేస్తున్నాం.

డిప్యూటీ కలెక్టర్‌: నిమ్జ్‌ భూముల్లో కొన్ని విండ్‌ టవర్లున్నాయి. వాటిని తొలగిస్తాం. ఈ మేరకు ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పక్కాగా భూసేకరణ1
1/1

పక్కాగా భూసేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement