హరీశ్‌రావుకు రాములునేత పరామర్శ
జహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును జాగో తెలంగాణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ రాములు నేత బుధవారం పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి మరణించిన విషయం తెసుకున్న రాములునేత హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాస గృహానికి వెళ్లి కలిశారు. అనంతరం ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జాగో తెలంగాణ కార్యవర్గ సభ్యులున్నారు.
గీత కార్మికులకు
పింఛను ఇవ్వాలి
కల్లుగీత కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్
సంగారెడ్డి టౌన్: అర్హులైన కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం రూ.నాలుగు వేల పింఛను అందించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో బుధవారం కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఈత, తాటి చెట్ల పెంపకానికి, అనేక విధాలుగా కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దళారులను ఆశ్రయించొద్దు
మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎవరూ మధ్యవర్తుల్ని, దళారుల్ని ఆశ్రయించవద్దని మున్సిపల్ కమిషనరు జగ్జీవన్ సూచించారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ బిల్డ్‌నౌలో ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫీజులను సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అనుమతులిస్తామని తెలిపారు. మధ్యవర్తులు, దళారులు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది శాండ్విక్
కార్మికుల విజయం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
పటాన్‌చెరు టౌన్: శాండ్విక్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరగాలని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు నెలలుగా చేసిన పోరాటం విజయవంతమైంది. కార్మికులు చేసిన ఆందోళనలతో జీవోలకు మించి వేతనాలు సాధించుకున్నారని ఇది పూర్తిగా కార్మికుల విజయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యంపై ఒత్తిడి చేసి జీవోపై అదనంగా రూ. 285ల పెరుగుదల సాధించామన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు సౌకర్యాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ నికరంగా పోరాడుతోందని, ఈ పోరాటానికి ఐక్యంగా మద్దతునివ్వాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో యూనియన్ నాయకులు పాండురంగారెడ్డి, వీరారావు, వీఆర్‌కే రాజు తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌రావుకు రాములునేత పరామర్శ


