సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు

Oct 22 2025 10:08 AM | Updated on Oct 22 2025 10:08 AM

సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు

సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు

దుబ్బాకటౌన్‌: రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్‌ ఏడీఏ బాబు నాయక్‌ అన్నారు. మంగళవారం రాయపోల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు జాతీయ నూనె గింజల పథకం కింద పొద్దు తిరుగుడు రకం తిల్హన్‌ టెక్‌ ఎస్‌యుఎన్‌హెచ్‌ – 1 విత్తనాల 2.50 కేజీలకు సబ్సిడీ పోను రూ. 85.20 కే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్‌బీఈజీ–47 శనగ రకాలు, సీటీ – 4260 మొక్కజొన్న రకం విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జీరాక్స్‌తో వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ నరేశ్‌, ఏఈవోలు ప్రవీణ్‌ ఉన్నారు.

ఏడీఏ బాబు నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement