
తల్లిదండ్రులు మందలిస్తారనే..
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కొంతన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బాడిగే మల్లేశ్‌కు ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రోజా(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. కొన్నాళ్ల నుంచి దొంతి గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా తండ్రికి తెలిసి మందలించాడు. ఈ నెల 19న తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో రోజా ఇంటి వద్ద ఉండటంతో ప్రశాంత్ వచ్చి మాట్లాడగా కాలనీవాసులు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారనే భయంలో ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.