భార్య కాపురానికి రావడం లేదని..
ఉమ్మడి జిల్లాలో ఐదుగురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పార్థిగల్ల శివరాజ్(29) మూడేళ్ల క్రితం శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన అఖిలతో వివాహమైంది. కొంత కాలంగా సంసారం విషయంలో ఇంట్లో గొడవలు జరగగా భార్య అఖిల తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శివరాజ్ ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు తలుపులు పగులగొట్టి మెదక్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
మద్యం మత్తులో..
మద్యం మత్తులో వ్యక్తి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన కుమార్(34) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మెదక్ మండలం పాతూర్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూలీ పనికి వెళ్లొస్తానని చెప్పిన కుమార్ మందు తాగా వచ్చి నిత్యంలాగే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం చూసేసరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. గమనించిన భార్య నిర్మల కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
ఇంట్లో గొడవపడిన మహిళ..
పాపన్నపేట(మెదక్): నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏడుపాయల్లో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... రామాయంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన రేణమ్మ (45) సోమవారం ఇంట్లో గొడవపడి ఏడుపాయలకు వచ్చింది. మొదటి బ్రిడ్జి దగ్గర మంజీరా నదిలో దూకింది. కాగా మంగళవారం సాయంత్రం నదిలో ఆమె శవం కనిపించడంతో పోలీసులు ఆమె భర్త మల్లేశ్‌కు సమాచారం అందించారు.
పాలడుగులో పశువుల కాపరి...
వట్‌పల్లి(అందోల్): పశువుల కాపరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పాలడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీహరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హరిజ అశోక్(50)కు భార్య అపురూపతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం సంసార విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పిల్లలను తీసుకొని భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో అశోక్ గ్రామంలో పశువుల కాపరిగా పనిచేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు. సోమవారం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించారు. మృతుని అక్క శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి పురుషాంగం ప్రదేశంలో, కాళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య


