
2న కార్తీక వన భోజనాలు
సంగారెడ్డిటౌన్ : రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 2న కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి జిల్లాలోని వీరశైవ లింగాయత్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. అనంతరం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ధనంజయ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాటిల్, కోశాధికారి గోవురాజు, ఉపాధ్యక్షుడు సంగిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
ర్యాకల్‌లో సంచార
సైన్స్‌ల్యాబ్ ప్రదర్శన
నారాయణఖేడ్: ఖేడ్ మండలం ర్యాకల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం శాస్త్ర సంచార ప్రయోగశాల ప్రదర్శన( మొబైల్ సైన్స్ ల్యాబ్)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ప్రయోగాలను ప్రదర్శించి వాటి తయారీని వివరించారు. 8వతరగతి చదువుతున్న నిఖిల్ తయారుచేసిన ఫ్యాన్‌ను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తిలకించి సదరు విద్యార్థిని అభినందించారు. నాగల్‌గిద్ద ఎంఈఓ మన్మథకిశోర్, ప్రధానోపాధ్యాయులు గోపాల్, రీసోర్స్‌పర్సన్లు వినయ్‌కుమార్, ధన్‌సింగ్‌యక్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు నర్సింహులు పాల్గొన్నారు.
కార్మికులకు బీమా
చేయించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీలోని ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో బుధవారం గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు కష్టపడి పనిచేసిన ప్రతి నెలా రెగ్యులర్‌గా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు సబ్బులు, నూనెలు, యూనిఫాం ఇవ్వాలని కోరారు. కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు వేతనాలు వచ్చిన ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, దశరథ్ నాయకులు మహేశ్, పోచయ్య, శంకర్, విజేందర్, భీమయ్య, ఇమ్మానియేల్, నిరంజన్, రవి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా సదర్ ఉత్సవం
రామచంద్రాపురం(పటాన్ చెరు): రామచంద్రాపురం పట్టణంలో యాదవ సంఘం, సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను అలంకరించి వాటితో విన్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ బి.పుష్ప తదితరులు పాల్గొన్నారు.

2న కార్తీక వన భోజనాలు

2న కార్తీక వన భోజనాలు