
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మూసివేత
జహీరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టును అధికారికంగా మూసివేశారు. సంబంధిత శాఖ సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి వద్ద ఈ చెక్‌పోస్టును నిర్వహిస్తూ వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల క్రితమే మూసివేసినా రాష్ట్రంలో నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీటిని మూసివేసేందుకు సానుకూలత వ్యక్తం చేయకపోవడం వల్లే కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెక్‌పోస్టుల మూసివేతకు సానుకూలంగా ఉండటంతో అందులోభాగంగా జహీరాబాద్ చెక్‌పోస్టును మూసివేశారు. సరిహద్దు చెక్‌పోస్టులను మూసివేస్తున్నట్లు, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని రవాణ కమిషనర్ అధికారికంగా ప్రకటించడంతో రవాణశాఖ జిల్లా అధికారులు చెక్‌పోస్టును సందర్శించి మూసివేయించారు. జిల్లా రవాణశాఖ కమిషనర్ వెంకట రమణ సమక్షంలో అధికారులు చెక్‌పోస్టు బోర్డులను, బారికేడ్లను తొలగించారు. చెక్‌పోస్టులో ఉన్న కంప్యూటర్లు, రికార్డులు, ఇతర ఫర్నీచర్‌ను డీటీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు మూసివేసినట్లు బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యవస్థ నడుస్తోందని, అందులో ఎలాంటి సర్వీసునైనా ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రజలు, వాహనదారులు పొందవచ్చన్నారు.

గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025