
శభాష్ పోలీస్..
జహీరాబాద్ టౌన్: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు. ఎస్‌ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... మండలంలోని బుర్దిపాడ్‌కు చెందిన ఏ.సంతోష్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా భార్య నాగరాణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లలు దీపక్‌రెడ్డి, అక్షయలతో కలిసి జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులో దూకేందుకు అక్కడికి వెళ్లింది. వారిని చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్‌ఐ.కాశీనాథ్ వెంటనే కాస్టేబుళ్లు శివరాజ్, మోహన్‌రాజ్‌లను ప్రాజెక్టు వద్దకు పంపించారు. వారితో మాట్లాడి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు
యత్నించిన మహిళ
కాపాడిన పోలీసులు