మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ రాఘవులు
పటాన్‌చెరు టౌన్: దేశ ధర్మ ఐక్యతకు పాటుపడే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుందని మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ రాఘవులు అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ నుంచి పలు వీధుల గుండా పథ్ సంచాలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వందేళ్ల కిందట ఐదు మంది స్వయం సేవకులతో ప్రారంభమై నేడు లక్ష లాది శాఖలతోపాటు కోట్లాదిమంది స్వయం సేవకులతో ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పథ్ సంచాలన్‌లో పాల్గొన్న యువతను అభినందించారు.
డ్రిప్ పరికరాలు ధ్వంసం
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆయిల్ పామ్ తోటలో దుండగులు డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం చిన్నకోడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కర్నే శ్రీలత, కర్నే సత్తవ్వలు మూడున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. గత నెలలో ఒకసారి మొక్కలు తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి తమ తోటలోని డ్రిప్ పరికరాలు పూర్తిగా ధ్వంసం చేశారని వాపోయారు. దీంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పేకాట స్థావరంపై దాడి
ముగ్గురు అరెస్టు, 10 మంది పరారీ
వెల్దుర్తి(తూప్రాన్): పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. తూప్రాన్ సీఐ రంగకృష్ణ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు వెల్దుర్తి ఎస్‌ఐ రాజు సిబ్బందితో దామరంచ అటవీప్రాంతంలో దాడిచేయగా కొందరు వ్యక్తులు అక్కడ జూదం ఆడుతున్నారు. పోలీసులను గమనించి పదిమంది అక్కడి నుంచి పరారయ్యారు. కాగా ముగ్గురు జూదరులు పట్టుబడ్డారు. ఘటనా స్థలం నుంచి 5 మోటార్ సైకిళ్లు, 8 మొబైల్ ఫోన్లతో పాటు రూ. 3,29,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ కలప పట్టివేత
ట్రాక్టర్ సీజ్
తూప్రాన్: అక్రమంగా తరలిస్తున్న కలపతోపాటు ట్రాక్టర్‌ను ఆదివారం అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా... పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు వెనుక అక్రమంగా చెట్లు నరికి ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన అటవీ శాఖ అధికారులు అనుమతులు లేకుండా చెట్లను నరకడం చట్ట రీత్యా నేరమని సదరు వ్యక్తికి జరిమానతో పాటు ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.
యశ్వంత్‌రావు పాటిల్‌కు అవార్డు
జహీరాబాద్ టౌన్: తెలంగాణ బసవదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశ్వంత్‌రావు పాటిల్‌కు బసవ పీఠం వారు శరణ కాయకరత్న అవార్డును ప్రదానం చేశారు. కర్నాటక రాష్ట్రంలోని బసవ కల్యాణ్‌లో జరుగుతున్న 24వ కల్యాణ పర్వ సమ్మేళనంలో ఆయనకు బసవ ధర్మపీఠం మహిళా జగద్గురు గంగామాతాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాటిల్‌ను రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్, జహీరాబాద్ అధ్యక్షుడు శరణప్ప తదితరులు అభినందించారు.
దేశ ఐక్యతకు పాటుపడతాం
దేశ ఐక్యతకు పాటుపడతాం
దేశ ఐక్యతకు పాటుపడతాం
దేశ ఐక్యతకు పాటుపడతాం