
హరేకృష్ణ మందిరాన్ని నిర్మిస్తాం
హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధి విభీషణ్ ప్రభు
జహీరాబాద్: జహీరాబాద్‌లో అక్షయపాత్ర భవనంతో పాటు హరేకృష్ణ మందిరాన్ని నిర్మించనున్నట్లు కందిలోని హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధి విభీషణ్ ప్రభు తెలిపారు. ఆదివారం పట్టణంలోని హనుమాన్ మందిరం ప్రాంగణంలో 176వ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయా నిర్మాణాలకు తమ బృంద సభ్యులు స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా అనాథలకు ఉచితంగా, పేద ప్రజలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సైతం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో దామోదర మాసం సందర్భంగా దీపారాధన చేశారు. అలాగే హుగ్గెల్లి గ్రామంలో 141వ పల్లె సంకీర్తన నిర్వహించారు.