
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత, కార్మికులను చిత్తు చే
● గ్రామాలకు పాకిన వ్యసనం ● అడ్డాలుగా పరిశ్రమలు, రైల్వేస్టేషన్లు, దాబాలు
మత్తు.. చిత్తు
గంజాయి మత్తులో జోగుతున్న యువత
మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేల సంఖ్యలో జిల్లాలోని పలు పరిశమ్రల్లో పనిచేస్తున్నారు. వీరు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి వస్తున్న క్రమంలో అక్కడి నుంచే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రైళ్లలో తీసుకొస్తున్నట్లు పోలీస్‌శాఖ అనుమానిస్తుంది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖతోపాటు పోలీస్‌శాఖ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల పలుమార్లు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
జాతీయ రహదారిపై ..
జిల్లా మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి 11 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాలనుంచి జాతీయ రహదారి మీదుగా గంజాయి అక్రమ సరఫరా పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు సమాచారం. గత ఏడాది పెద్ద మొత్తంలో గంజాయి తరలిస్తున్న కారు రామాయంపేటవద్ద ప్రమాదానికి గురికాగా ఈ విషయం బయటపడింది. జాతీయ రహదారిపై ఎక్కడో ఒకచోట తరచూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి.