
రైల్వే స్టేషన్ల నుంచి రవాణా!
ప్రధానంగా రైళ్ల ద్వారానే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా అవుతున్నట్లు సమాచారం. జిల్లాలోని ప్రధానంగా మెదక్, అక్కన్నపేట, మీర్జాపల్లి, వడియారం రైల్వేస్టేషన్లలో వీటి వినియోగం ఇటీవల పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న యాచకులు, వారి అనుచరులు గంజా యి, ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తూ తరచూ గొడవలకు దిగుతున్నారు. గంజాయి దొరకని పరిస్థితుల్లో వారు వైట్‌నర్, వాహనాల టైర్ల పంక్చర్ కోసం వినియోగించే ద్రావణం బోనోఫిక్స్, ఫెవికిక్ వాడుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి అక్కన్నపేట స్టేషన్‌ను సందర్శించిన సమయంలోనే యాచకులిద్దరూ జేబు రుమాలులో బోనోఫిక్స్ ద్రావణం వేసుకుని యాదృచ్ఛికంగా కంటపడ్డారు. వారు రుమాలులో వేసుకున్న ద్రావణాన్ని ముక్కుదగ్గర ఉంచుకొని మత్తులో తేలడం కనిపించింది.