
బకాయిలు విడుదల చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్నేండ్లుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తమ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కట్టుకలిసిగా భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచైనా సరే బకాయిలు విడుదల చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మహేశ్, రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షు డు సతీశ్, సహాయ కార్యదర్శి అర్జున్, జిల్లా కమిటీ సభ్యులు స్వరాజ్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు.