తల్లిదండ్రులను మించిన దైవం లేదు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులను మించిన దైవం లేదు

Oct 11 2025 9:32 AM | Updated on Oct 11 2025 9:32 AM

తల్లిదండ్రులను మించిన దైవం లేదు

తల్లిదండ్రులను మించిన దైవం లేదు

పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ

హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌చైర్మన్‌ బక్కి వెంకటయ్య

దుబ్బాక: తల్లిదండ్రులను మించిన దైవం లేదని రాంపూర్‌ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. నిరంతరం దైవనామస్మరణతోనే సర్వసుఖాలు చేకూరుతాయని తెలిపారు. పట్టణంలో గ్రామదేవత అయిన బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీ అమ్మవారి) విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శుక్రవారం సాయంత్రం మాధవానంద సరస్వతి స్వామిజీ పాల్గొని విగ్రహాలకు తదితర పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే భగవంతుడికి చేసినట్లేనన్నారు. ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో హాని తలపెట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, కత్తి కార్తీకతో పాటు పలువురు ప్రముఖులు, వేదపండితులు, కులసంఘాల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

వెల్లివిరిసిన మత సామరస్యం

దుబ్బాక: బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. పట్టణంలోని ముస్లిం మత గురువుగా ప్రసిద్ధి గాంచిన బిస్మిల్లా హకీమ్‌ బాబా బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు తన వంతుగా విరాళం అందించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement