
ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఎంపికలు
మెదక్‌జోన్ : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అండర్ –17 బాల బాలికలకు ఫుట్‌బాల్ ఎంపికలు జరిగాయి. ఉమ్మడి జిల్లా నుంచి 145 మంది బాలబాలికలు ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 18 మంది బాలికలు, 18 బాలురను ఎంపిక చేసి నవంబర్ మొదటి వారంలో నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, పీడీలు శ్రీధర్ రెడ్డి, నగేశ్, శ్రీనివాసరావు, రూపేందర్, దేవేందర్ రెడ్డి, శేఖర్, దేవానంద్ పాల్గొన్నారు
జగదేవ్‌పూర్(గజ్వేల్): బాలికపై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని రోజులుగా ప్రేమించమని వెంటపడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.