
గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
మద్దూరు(హుస్నాబాద్): గంజాయి తాగడమే కాకుండా అమ్మడానికి యత్నిస్తున్న ముగ్గురు యువకులపై కేసు నమోదైంది. చేర్యాల సీఐ శ్రీను శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన పండ్ల ప్రణయ్, వడ్లకొండ గ్రామానికి చెందిన గడ్డం పువన్, మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన మహ్మద్ సోహెల్ ఉప్పరొనిడ్డ సమీపంలో గంజాయి తాగుతున్నారనే సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, మద్దూరు పోలీసులు కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద 123 గ్రాముల గంజాయి, 2ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.