
రవాణా సమస్య పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి ఏడు గ్రామాలకు రవాణా సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మాట్లా డుతూ.. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మెదక్ నుంచి శివ్వాయిపల్లికి వెళ్లే దారిలో గల బ్రిడ్జి కొట్టుకుపోయిందని, వంతెనను పునరుద్ధరించాలని కోరారు. అలాగే రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ కాల్వలకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరు అందించాలన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టడం ద్వారా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలన్నారు.