కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం

Sep 20 2025 7:46 AM | Updated on Sep 20 2025 7:46 AM

కబడ్డ

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం

దుబ్బాకరూరల్‌: సిద్దిపేటలో జిల్లా స్థాయి కబడ్డీ అండర్‌–17 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలల్లో మండంలోని హబ్సిపూర్‌లో గల మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. విద్యార్థులు కిరణ్‌, భవదీష్‌, భానులను ప్రిన్సిపాల్‌ గోపాల్‌రెడ్డి అభినందించారు. అదే విధంగా ఇందుకు కృషి చేసిన పీఈటి తరుణ్‌రాజ్‌లను పాఠశాల సిబ్బంది అభినందించారు.

ఎలమ్మ దేవాలయంలో చోరీ

మద్దూరు(హుస్నాబాద్‌): మద్దూరు మండలం జాలపల్లిలో ఎల్లమ్మ దేవాలయంలో గురువారం రాత్రి దుండగలు దొంగతనానికి పాల్పడారు. గౌడ సంఘం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కులదైవమైన ఎల్లమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన గల్లా పెట్టే పగులగొట్టి అందులోని నగదు, అమ్మవారి పుస్తె మట్టెలు, ముక్కుపుడక అపహరించినట్లు తెలిపారు. పుస్తె మట్టెలు ముక్కుపుడక తులం వరకు ఉంటుందని, గల్లా పెట్టెలో రూ.15– 20 వేల వరకు నగదు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

నాచారం వాగులో

యువకుడి మృతదేహం

వర్గల్‌(గజ్వేల్‌): మానసిక స్థితి సరిగాలేని యువకుడు వర్గల్‌ మండలం నాచారం వాగులో శవమై తేలాడు. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మానసిక స్థితి సరిగాలేని హుస్సేన్‌(18) అనే యువకుడు కొన్ని నెలల నుంచి గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి ఆశ్రమ్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆశ్రమ్‌ నిర్వాహకులు చుట్టుపక్కల వెతికినప్పటికి ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం నాచారం వాగులో యువకుని మృతదేహం తేలింది. హుస్సేన్‌ మృతదేహంగా ఆశ్రమ్‌కు చెందిన రుశీల్‌నాయర్‌ గుర్తించారు. ఆయన ఫిర్యాదుమేరకు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరికి గాయాలు

చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లారం శివారులో శుక్రవారం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కార్తీక్‌(35) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం అనంతసాగర్‌లో డ్రోన్‌ ద్వారా పంట పొలానికి మందు పిచికారీ చేసి సిద్దిపేటకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో మల్లారం వద్ద నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. కార్తీక్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌కు చెందిన దండుగుల రాజు(32) పది రోజుల క్రితం గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల జీవితం మీద విరక్తి చెంది ఈ నెల 8న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

పాపన్నపేట(మెదక్‌): మండలంలోని నాగ్సాన్‌పల్లి గ్రామ శివారునుంచి గురువారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంజీరా నది, చెరువుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం1
1/2

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం2
2/2

కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement