
అదనంగా 356 బస్సులు
ఏర్పాట్లు పూర్తి: ఆర్‌ఎం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ, దసరా సందర్భంగా 356 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. ప్రతి బస్టాండ్‌లో అదనపు సిబ్బందిని పర్యవేక్షణకు ఉంచామన్నారు. అవసరాన్ని బట్టి బస్సులను పెంచుతామని, అదనపు చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాత్ర దానం పేరుతో దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారిని బస్సు సర్వీసులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
– ఆర్టీసీ ఆర్‌ఎం విజయ్ భాస్కర్
సంగారెడ్డి టౌన్: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 356 స్పెషల్ బస్సులను నడపనుంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో ప్రజలు సొంతూర్లకు వెళ్లనున్నారు. వివిధ గ్రామాలలో స్థిరపడిన వారితోపాటు, జీవనోపాధికి వెళ్లిన వారు సైతం గ్రామాలకు తిరిగి వస్తుంటారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపోలలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచడంతో కొంత మేర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. నిత్యం 569 సర్వీసలు తిరుగుతుండగా.. దసరా, బతుకమ్మల సందర్భంగా అదనంగా 356 బస్సులను ఏర్పాటు చేశారు. అదనపు బస్సులకు 50శాతం అదనపు చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఉండడంతో రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర దానం పేరుతో దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారిని తీర్థయాత్రలకు, గ్రామాలకు బస్సు సర్వీసులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది.
బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు
50శాతం అదనంగా చార్జీలు!
ప్రతి బస్టాండ్‌లో సిబ్బంది పర్యవేక్షణ
దసరా సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లు

అదనంగా 356 బస్సులు