
చెత్త వేయకుండా ముగ్గులు
నర్సాపూర్: రోడ్ల పక్కన చెత్త వేయకుండా మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి వినూత్న చర్యలు చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మెప్మా సిబ్బంది పట్టణంలోని సంగారెడ్డి రోడ్డు పక్కన చెత్త పారవేసే ప్రాంతాన్ని గుర్తించారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించి మెప్మా సిబ్బందితో ముగ్గులు వేయించి అందంగా తీర్చిదిద్దారు. వ్యాపారులు ఇష్టానుసారంగా చెత్త పారవేస్తున్నారని, సిబ్బందికి అందజేయాలని కమిషనర్ సూచించారు. కాగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మేనేజర్ మధుసూదన్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్లు దీప్తి, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.