
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు మాధవి ఎంపిక
గజ్వేల్‌రూరల్: ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు అహ్మదీపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాధవి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుగుణాకర్ తెలిపారు. అండర్–17 బాలికల విభాగంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాధవి ఈనెల 18న పటాన్‌చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన జోనల్‌స్థాయి చెస్ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికై ందన్నారు. విద్యార్థిని మాధవితో పాటు పీడీ నాగేష్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం రాణించి తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.