
ఖేడ్ గురుకులం ప్రిన్సిపాల్ బదిలీ
నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నాయక్ బదిలీ అయ్యారు. ప్రిన్సిపాల్‌గా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతోపాటు విద్యార్థులు గజ్జి, తామరతో సతమతమయ్యారు. ఈ విషయాలు పత్రికల్లో రావడంతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాఠశాలను తనిఖీ చేసి గురుకులం నిర్వహణ తీరుపై, ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి, ఆర్సీవో గౌతమిరెడ్డి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ప్రిన్సిపాల్‌ను జూబ్లిహిల్స్ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రతిభకు ఇన్‌చార్జీ బాధ్యలు అప్పగించారు.