
జిన్నారం (పటాన్‌చెరు)
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీ హైదరాబాద్ చొరవతో కంది మండల పరిధిలోని ఎద్దు మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జపాన్‌లోని విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి, చదువుతున్న తీరును, సంస్కృతి సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జి ఎంఈఓ జోగప్ప, ఐఐటీ ప్రొఫెసర్ హేమంత్ నూతలపాటి పాల్గొన్నారు. - కంది(సంగారెడ్డి)
గడ్డపోతారం పట్టణ పరిధిలోని వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందీ పండిట్ మాధవీలత విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజారావు శర్మ, ఋషి, రాజిరెడ్డి, జయలతా, పవన్ రాజ్, పెంటయ్య తదితరులుపాల్గొన్నారు. - జిన్నారం (పటాన్‌చెరు)

కంది (సంగారెడ్డి)