
చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్ : విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గౌడలకు రక్షణ కల్పించాలి
కల్లుగీత కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్
సంగారెడ్డి టౌన్: గౌడ కులస్తులకు గ్రామాల్లో రక్షణ కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలోని గౌడ కులానికి చెందిన వారిని విడిసి పేరుతో గ్రామ బహిష్కరణ చేసి దౌర్జన్యం చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ...గౌడలకు రక్షణ కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వలంటీర్లతో భర్తీ చేయండి
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను తక్షణమే విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిన్నారంలో ఆయన విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ...ఇటీవల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులపై వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోరాటాలకుసిద్ధం కావాలి: రాజయ్య
జహీరాబాద్ టౌన్: తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాజయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని శ్రామిక్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయక్వతం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు బి.రాంచందర్, నాయకులు మహి పాల్, సలీమోద్దీన్ పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి