జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌కుఎంపీ ఎం.రఘునందన్‌రావు వినతి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భెల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్ మీదుగా సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కు వరకు వందరోజుల్లో రోడ్డును పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ను ఎంపీ ఎం.రఘునంద న్‌రావు కోరారు. మంగళవారం రామచంద్రాపురం పట్టణంలోని భెల్ చౌరస్తాలో కర్ణన్‌తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భెల్ చౌరస్తాలోని జాతీయరహదారి నుంచి రింగ్‌రోడ్డు వరకు రూ.వందకోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం తన ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. నాలాగా మారిన చిన్నవాగులోని ఆక్రమణలను వెంటనే తొలగించి దానిపై వంతెన నిర్మించాలని ఆదేశించారు. ఈ రహదారి పూర్తయితే అమీన్‌పూర్, బొల్లారం ప్రాంతంలోని ప్రజలతో పాటు శేరిలింగంపల్లి ప్రజలకు రింగ్ రోడ్డు ప్రయాణం సులభతరమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, నాయకులు ఎడ్ల రమేశ్, నర్సింగ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.