మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి

Sep 16 2025 8:34 AM | Updated on Sep 16 2025 8:34 AM

మెదక్

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి

మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి బాధ్యతలను కూడా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తికి అప్పగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అలాగే పేకాట, గ్యాంబ్లింగ్‌, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అణచివేయాలని సూచించారు.

జ్వరంతో బాధపడుతున్న

విద్యార్థినులు

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని పలు కళాశాలలు, హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో హాస్టళ్ల భవనాల చుట్టూ మురుగు నీరు నిలిచి దోమలతో సతమతమవుతున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కాగా గురుకుల డిగ్రీ హాస్టల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విద్యుత్‌ వైరు కాళ్లకు తాకి..

– షాక్‌తో రైతు మృతి

పాపన్నపేట(మెదక్‌): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మిన్‌పూర్‌ శేఖర్‌(30)పొలానికి వెళ్తూ.. హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్మునితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో తెగి పడిన విద్యుత్‌ వైరును చూడకపోవడంతో కాళ్లకు తగిలింది. షాక్‌ కొట్టగానే అరుస్తూ కిందపడ్డాడు. ఫోన్‌లో అన్న అరుపు విన్న తమ్ముడు అప్రమత్తమై కుటుంబీకులకు చెప్పాడు. వెంటనే వాళ్లు పొలం వద్దకు వెళ్లి కొన ఊపిరితో ఉన్న శేఖర్‌ను మెదక్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య యశోద, కొడుకులు ప్రదీప్‌, హర్షవర్ధన్‌ ఉన్నారు.

పోక్సో కేసులో ఒకరికి జైలు

పెద్దశంకరంపేట(మెదక్‌): పోక్సో కేసులో కోర్టు ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని మాడ్చెట్‌పల్లి గ్రామానికి చెందిన నిందితుడు తలారి మోహన్‌ 2020లో ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్‌ ఆశ చూపి అత్యాచారం చేశాడు. దీంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో మెదక్‌ ఫాస్ట్రాక్‌ కోర్టు జడ్జి నీలిమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమాన విధించినట్లు పోలీసులు తెలిపారు.

కొండముచ్చుల దాడిలో

వ్యక్తికి గాయాలు

జహీరాబాద్‌ టౌన్‌: పట్టణంలోని శాంతినగర్‌ ప్రాంతంలో సోమవారం కొండముచ్చులు వ్యక్తిపై దాడి చేశాయి. ఈ దాడిలో శాంతినగర్‌కు చెందిన అమర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం రాంనగర్‌, గాంధీనగర్‌ ప్రాంతంలో కొండముచ్చుల గుంపు రోడ్డుపై నుంచి వెళ్తున్న ప్రజలపై దాడి చేయగా శరణమ్మ, రాజ్‌కుమార్‌లకు గాయాలైన విషయం తెలిసిందే. వరుసగా కొండముచ్చులు దాడి చేయడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా  కృష్ణమూర్తి1
1/2

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా  కృష్ణమూర్తి2
2/2

మెదక్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement