
అభివృద్ధి పనులపై అధ్యయనం
మల్కాపూర్‌లో యూపీ బృందం పర్యటన
తూప్రాన్: మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో యూపీకి చెందిన సుమారు 20 మంది ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్‌యార్డు, సిగ్రిగేషన్, రాక్ గార్డెన్, కమ్యూనిటీహల్, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించించారు. ఇదే తరహాలో తమ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట ఎంపీడీఓ సతీశ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.