
సేవాభావంతో మెలగాలి
ఎంపీ రఘునందన్‌రావు
జిన్నారం(పటాన్‌చెరు): ప్రతీ కార్యకర్త ప్రజలతో సేవాభావంతో మెలగాలని ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. జిన్నారం పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాకార్యక్రమాలను నిర్వహించాల ని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు పరిష్కరించేలా ముందుకు వెళ్లాల ని చెప్పారు. ఈ నెల 17న ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో ప్రతీ కార్యకర్త పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దోమడుగు రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.