
తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మిగిలిన సీట్లకు ఈనెల 15, 16వ తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మే రకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 94410 69020ను సంప్రదించవచ్చని తెలిపారు.
సింగూరుకు 6,136క్యూసెక్కుల నీరు
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 6,136 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..దిగువకు 2,329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా రెండు టర్బయిన్లను ఆన్‌చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
లోక్ అదాలత్‌ను
విజయవంతం చేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏఐ పాఠంపై విద్యార్థుల ఆసక్తి: డీఈఓ
పటాన్‌చెరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలో కృత్తిమ మేథ(ఏఐ) బోధనపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాల తరగతిగదిలో పర్యటించి, అక్కడ ఉపాధ్యాయులు చెపుతున్న బోధన తీరును పరిశీలించారు. అనంతరం ఏఐ బోధన ద్వారా పాటలు వింటున్న విద్యార్థులను చూశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కంప్యూటర్ ఆధారిత బోధన ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిమ్జ్ డిప్యూటీ
కలెక్టర్‌గా విశాలాక్షి
జహీరాబాద్: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్–2 గా విశాలాక్షి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ కార్యాలయంలో జేడీగా పని చేసిన ఆమెను జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె జహీరాబాద్ ఇన్‌చార్జి ఆర్డీఓ డెవుజాతో సమావేశమయ్యారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో శుక్రవారం సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘మతోన్మాదదాడులు–రాజ్యాంగం–లౌకికవాదం ఆవశ్యకత’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...సీతారాం ఏచూరి మృతి ప్రజలకు, పార్టీకి తీరని లోటన్నారు.

తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు