
మీడియాపై దాడి అప్రజాస్వామికం
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. నిరంకుశంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..
కేసుల నమోదు అప్రజాస్వామికం
జహీరాబాద్: పాత్రికేయులపై కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామికం. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. తపస్ ఉపాధ్యాయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
– దత్రాత్తి, తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు,జహీరాబాద్
అది రాజ్యాంగం కల్పించిన హక్కు
సంగారెడ్డి జోన్: ప్రజాస్వామ్యంలో వార్తలు రాసే హక్కు పాత్రికేయులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అణిచి వేయబడుతున్న వారికి మద్దతుగా నిలబడి, అన్యాయం చేస్తున్న వారి దౌర్జన్యాలను నిలదీస్తూ ప్రజలకు తెలియజేసే హక్కు పత్రికలకు ఉంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారు.
– రాంచందర్ భీం వంశీ, ఉపాధ్యాయుడు,టీజేఏసీ చైర్మన్, జహీరాబాద్
కేసులు పెట్టడం సరికాదు
సంగారెడ్డి టౌన్: పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు మూలస్తంభాలు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉండే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.
– మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్, న్యాయవాది
ప్రశ్నించే గొంతు నొక్కడమే
జీహరాబాద్: సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే వారిపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే అవుతుంది. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు విలేకరులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే.
– తులసీరాం రాథోడ్,
టీబేస్‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్

మీడియాపై దాడి అప్రజాస్వామికం

మీడియాపై దాడి అప్రజాస్వామికం

మీడియాపై దాడి అప్రజాస్వామికం

మీడియాపై దాడి అప్రజాస్వామికం