
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచండి
● లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించండి
● ఏఈలకు హౌసింగ్ పీడీ మాణిక్యం ఆదేశం
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, లబ్ధిదారుల దగ్గరుండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం ఏఈలకు సూచించారు. బుధవారం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఏఈలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ లబ్దిదారులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వారం వారం బిల్లులు అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు తెలిపాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన చేపట్టేందుకు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎప్పటికప్పుడు నిర్మాణాలను ఫొటో క్యాప్చర్ చేసి హౌసింగ్ యాప్‌లో పొందు పర్చాలన్నారు. తద్వారా లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు అందుతాయన్నారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు సంప్రదించాలని కోరారు. అన్ని మండలాల ఏఈలు పాల్గొన్నారు.