
విజయవంతం చేయాలి
జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధి కారులు కలసి జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసులను పరిష్కరించుకోవడానికి సహకరించాలి.
– భవానీ చంద్ర, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సరిదిద్దుకోవచ్చు
అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, పెండింగ్‌లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలి.
– పరితోశ్ పంకజ్, జిల్లా ఎస్పీ

విజయవంతం చేయాలి