
కాపర్ కేటుగాళ్లు
● ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి వైర్ చోరి
● దుండగులకు పట్టుకోవాలని రైతుల విజ్ఞప్తి
మద్దూరు(హుస్నాబాద్): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాఫర్ వైర్ చోరి అయిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వారాల శ్రీను వ్యవసాయ బావి వద్ద గల 16కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కాఫర్ వైర్‌ను దొంగిలించినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు వాపోతున్నారు.