
పంటల సస్యరక్షణపై అవగాహన
తొగుట(దుబ్బాక): విద్యార్థులు క్షేత్రస్థాయిలో పొలంబాట పట్టారు. మండలంలోని గుడికందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి తోర్నాల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థినులు వ్యవసాయ పరిశోధనలో భాగంగా పంటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలకు రసాయనాలు వాడకుండా పెరమోన్, ట్రాప్ జిగురు అట్టల వాడకంపై పాఠశాల విద్యార్థులకు వివరించారు. అలాగే కృత్రిమ ఎరువుల వాడకం వివిధ రసాయనాలను చల్లడం వల్ల కలిగే నష్టాల గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు భిక్షపతి, శివయ్య పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025–26 అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకి చెందిన బుచ్చగోని ప్రజ్ఞశ్రీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. బీఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఫలితాలు మంగళవారం విడుదలవ్వగా.. ప్రియాంక కాలనీకి చెందిన శంకర్‌గౌడ్, మంగమ్మ చిన్న కుమార్తె ప్రజ్ఞశ్రీ ర్యాంకు సాధి ంచింది. అంతకుముందు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన ఆమె జిల్లా టాపర్‌గా నిలిచింది. హైదరాబాద్‌లోని బండ్లగూడ నిర్వహణ ఉచిత కోచింగ్ సెంటర్‌లో గత ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు, కాలనీవాసులు అభినందించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చాల్కికి చెందిన గౌని గుండప్ప పత్తి పంటలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నాడు. సమాచారం మేరకు హద్నూర్ పోలీసులు, ఎకై ్సజ్ పోలీసులు రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ సుమారు 1.70లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తలిపారు. అనంతరం నిందితుడు గుండప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.
పటాన్‌చెరు టౌన్: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పటాన్‌చెరు డివిజన్‌లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి ఆపన్నహస్తం అందించారు. గత శనివారం పరిశ్రమలో ప్రమాదవశాత్తు అమర్‌సింగ్ అనే కార్మికుడు (59) యంత్రంలో పడి కుడి చేయి కోల్పోయాడు. ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ఆశ్రయించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి రూ. 25 లక్షల పరిహారం ఇప్పించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.

పంటల సస్యరక్షణపై అవగాహన

పంటల సస్యరక్షణపై అవగాహన

పంటల సస్యరక్షణపై అవగాహన