
రాష్ట్ర స్థాయి టీఎల్‌ఎంకు నందిని ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్): సమగ్ర శిక్షా రాష్ట్ర స్థాయి టీఎల్‌ఎం మేళాకు శివ్వంపేట ఉపాధ్యాయురాలు ఎంపికై ంది. బుధవారం మెదక్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాలో శివ్వంపేట శివాలయనగర్ పీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు మెతుకు నందిని పాల్గొంది. మేళాలో ఈవీఎస్ సబ్జెక్ట్ నుంచి విద్యార్థులకు సులభంగా బోధన అర్థమయ్యేలా ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర స్ధాయిలో నిర్వహించే మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ బుచ్చనాయక్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక పట్ల పాఠశాల హెచ్‌ఎం శేఖర్, మండల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.